కనిగిరి: పట్టణంలోని హాస్టల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి పట్టణంలోని బీసీ మరియు దయానంద నిలయం హాస్టల్స్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తో కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీసీ హాస్టల్ టాయిలెట్స్ అద్వాన్నంగా ఉండడాన్ని గమనించిన మంత్రి హాస్టల్ వార్డెన్ పై అసహనం వ్యక్తం చేశారు. టాయిలెట్స్ ను వెంటనే బాగు చేయించాలని ఆదేశించారు. రూ.20 లక్షల వ్యయంతో బీసీ హాస్టల్ ఆధునికీకరణ పనులు చేపడుతామని మంత్రి విద్యార్థులకు హామీ ఇచ్చారు. దయానంద నిలయంలో నేల పై కూర్చుని విద్యార్థుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.