డోన్: డోన్ లో విషాదం బుల్లెట్ బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Dhone, Nandyal | May 13, 2026 డోన్లోని కొండపేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. బుల్లెట్ బైక్ కొనివ్వలేదని మనస్తాపంతో మధు(18) ఉరేసుకొన్నాడు. కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.