కనిగిరి: రాష్ట్రంలోని 50 MSME పార్కులను లింగన్న పాలెం నుండి సీఎం చంద్ర బాబు ప్రారంభిస్తారు: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
పెద చెర్లోపల్లి మండలంలోని లింగన్నపాలెంలో MSME పార్కుతో పాటు రాష్ట్రంలోని 50 MSME పార్కులను మంగళవారం సీఎం చంద్రబాబు లింగన్న పాలెం నుండి వర్చువల్ గా ప్రారంభిస్తారని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం లింగన్న పాలెం లో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ... వెనుకబడిన ఈ ప్రాంతంలో MSME పార్క్ ఏర్పాటు ద్వారా పరిశ్రమల స్థాపన జరిగి, ప్రజలకు ఉపాధి లభిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో కనిగిరిలో రైల్వే లైన్ నిర్మాణం పూర్తికావచ్చిందని, ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణం కూడా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.