బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో అన్నదాత సుఖీభవకు 6197 మంది రైతులు ఎంపిక : ఏవో శారదా దేవి
కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాల నుంచి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు 6,197 మంది రైతులు ఎంపికైనట్లు మండల వ్యవసాయ అధికారిని సరదా దేవి పేర్కొన్నారు. శనివారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. మండలంలో మొత్తం 6,197 మంది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ.4.10 కోట్లు లబ్ధి చేకూరుతుందని ఏవో శారదా దేవి వెల్లడించారు.