నందికోట్కూరు: పట్టణంలోని ఒక కోల్డ్ స్టోరేజ్ లో 8,50,000 విలువైన HT కాటన్ విత్తనాలు సీజ్ చేసిన: వ్యవసాయ సహాయ సంచాలకులు గిరీష్
నంద్యాల జిల్లా నందికొట్కూరు నిషేధిత పత్తి విత్తనాలు అమ్ముతే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు వెల్లడించారు, శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని ఒక కోల్డ్ స్టోరేజ్ లో అనధికారికంగా ఉన్న 8,50,000 విలువైన HT కాటన్ విత్తనాల స్టాకును వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు, HT పత్తి విత్తనాలు నిల్వ చేయడం, అమ్మడం, సాగు చేయడం చట్టరీత్యా విరుద్ధమని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు గిరీష్, నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారి షేక్షావలి ఇతర వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు