మచిలీపట్నం దక్షిణం: చల్లపల్లి లో స్మార్ట్ మీటర్లను రద్దు చేయండి: సీపీఐ
Machilipatnam South, Krishna | Jul 5, 2025
చల్లపల్లి లో పేద ప్రజలపై భారం మోపే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సీపీఐ అవనిగడ్డ నియోజకవర్గ కార్య దర్శి రామారావు డిమాండ్ చేశారు. చల్లపల్లి సెంటర్లో కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ మీటర్ల విధానానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని కోరారు. స్మార్ట్ మీటర్ల విధానంతో పేద ప్రజల నడ్డి విరిచి, అదానీ, అంబానీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.