జగ్గంపేట: రాజపూడి హైస్కూల్లో సౌకర్యాల కొరతపై PDSU నాయకుల ఆగ్రహం
జగ్గంపేట మండలం రాజపూడిలోని హైస్కూల్లో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, కనీస సౌకర్యాలు లేవని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (POSU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడితి సతీశ్ ఆరోపించారు. ఏఐఎన్టీయూ, ఏపీ రైతు కూలి సంఘం, పీడీఎస్యూ సంఘాలు రాజపూడి హైస్కూల్ను పరిశీలించాయి. పిల్లలకు కనీస అవసరాలు తీర్చకుండా గాలికి వదిలేస్తున్నారని సతీశ్ విమర్శించారు.