సంగారెడ్డి: మంచిరెడ్డి సమస్య పరిష్కరించాలని సంగారెడ్డి విద్యానగర్ కాలనీవాసుల ఆందోళన
సంగారెడ్డి మున్సిపాలిటీలోని విద్యానగర్లో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లో ఆందోళన చేసి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ త్రాగు నీటి సరఫరా లేదని తద్వారా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కాగా మిషన్ భగీరథ నీళ్లు క్రమం తప్పకుండా వస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ప్రజల అవసరాల మేరకు తగినన్ని నీటి సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఉద్యోగులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.