ఒంగోలు అర్బన్: ప్రపంచ రక్తపోటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
Ongole Urban, Prakasam | May 20, 2026
ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు బుధవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారులు, సిబ్బందికి హైపర్ టెన్షన్ (ప్రపంచ రక్తపోటు దినోత్సవం)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి యోగా, మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు తెలియచేసారు. ఒంగోలు ఏఆర్ డీఎస్పీ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగా, మెడిటేషన్ మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రత, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు.