డోన్: డోన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష ఒకరికి పదివేల జరిమానా
Dhone, Nandyal | May 25, 2026 నంద్యాల జిల్లా డోన్లో మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురిలో ఇద్దరికి జైలు శిక్ష, మరొకరికి రూ. 10,000 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పునిచ్చారు. మద్యం తాగి వాహనం నడపడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేస్తూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.