బనగానపల్లె: రావుస్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి :నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సుంకన్న
నంద్యాలలోని రావుస్ విద్యాసంస్థలు ఐఐటీ, నీట్ పేరుతో భారీ ఫీజులు వసూలు చేస్తూ, కనీస ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించడం లేదని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగసారి సుంకన్న, రాయలసీమ ఇన్ఛార్జ్ మోపిరి సూర్య ఆరోపించారు. గురువారం మీడియాతో వారు మట్లాడారు. అగ్నిమాపక అధికారుల తనిఖీల్లోనూ నిబంధనల ఉల్లంఘన బయటపడిందన్నారు. దీనిపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సానుకూలంగా స్పందించారని అన్నారు.