ఉరవకొండ: అక్టోబర్ 7న విజయవాడలో జరిగే ప్యాప్టో పోరుబాటను విజయవంతం చేయండి : ప్యాప్టో జిల్లా చైర్మన్ ఆర్. శ్రీనివాస్ నాయక్
ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై అక్టోబర్ 7న విజయవాడలో జరిగే ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనంతపురం చైర్మన్ శ్రీనివాస్ నాయక్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని వెంకటాద్రి పల్లి ఉన్నత పాఠశాల, బెలుగుప్ప ఉన్నత పాఠశాలల క్రీడా మైదానంలో శనివారం సాయంత్రం ఉపాధ్యాయులతో కలిసి ప్యాప్టో పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించే పోరు బాట కార్యక్రమానికి ఉద్యోగ ఉపాధ్యాయుల పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.