పోచంపల్లి: జూలూరు లో లెవెల్ బ్రిడ్జి పై పేరుకుపోయిన గుర్రపుడెక్క ఆకు, తొలగించిన గ్రామపంచాయతీ సిబ్బంది
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, జూలూరు లో లెవెల్ బ్రిడ్జిపై ఎగువన కురిసిన భారీ వర్షాలకు మూసేవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కొట్టుకొచ్చిన గుర్రపు డెక్క ఆకు భారీగా పేరుకుపోయింది. దీంతో రుద్రెల్లి, జూలూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామపంచాయతీ సిబ్బంది లో లెవెల్ బ్రిడ్జిపై పేరుకుపోయిన గుర్రపుడెక్క ఆకులను ఆదివారం ఉదయం తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.