వీరభద్ర స్వామిని దర్శించుకున్న అన్నమయ్య నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్
అన్నమయ్య జిల్లాకు కొత్త కలెక్టర్గా నిశాంత్ కుమార్ నియమితులయ్యారు. ఆయన రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంను ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ దర్శనం ముగిసిన తర్వాత కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.