బనగానపల్లె: యాగంటిలో వైభవంగా స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటిలో శ్రీ ఉమామహేశ్వర స్వామివార్లకు పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను పల్లకిలో కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓంకార నామస్మరణల మధ్య ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్ మౌలీశ్వర్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.