ఒంగోలు అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్) ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించకుండా పనిచేయాలి : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jul 10, 2026
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్) ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సంతనూతలపాడు, పీర్లవాన్యం సచివాలయాలను సందర్శించారు. వాటి పరిధిలో ' సర్ ' నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించాల్సి వస్తే నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సంబంధిత కుటుంబ సభ్యుల బంధువులకు / ఇరుగుపొరుగు వారికి నోటీసుల రూపంలో తెలియజేయాలన్నారు. సంబంధిత ఆధారాలను కూడా భద్రపరుచుకోవాలని చెప్పారు. ఆయా విషయాల్లో స్థానిక బీ.ఎల్.ఏ.ల సహకారం తీసుకోవాలన్నారు.