ఒంగోలు అర్బన్: కోర్టు ఆర్డర్ తో 18 సంవత్సరాల తర్వాత సొంత స్థలాన్ని స్వాధీనం చేసుకున్న బాధితుడు
Ongole Urban, Prakasam | Jun 7, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి షో రూమ్ నిర్వహణ కోసం తన 135ల స్థలాన్ని అద్దెకిచ్చాడు ఐదు సంవత్సరాల అద్దె అగ్రిమెంటు తీరిన తర్వాత అద్దె చెల్లించకుండా షోరూం కాళీ చేయనంటూ షోరూమ్ యజమాని అడ్డం తిరిగాడు. దీంతో బాధితులు కోర్టుకెళ్లి కోర్టు ద్వారా తన స్థలం తనకు కావాలంటూ ప్రయత్నం ప్రారంభించాడు 18 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పురావడంతో తన సొంత స్థలాన్ని తన స్వాధీనం చేసుకునేందుకు ఈరోజు సిద్ధమయ్యారు ఆదివారం మధ్యాహ్నం కోర్టు ఆర్డర్ నేపథ్యంలో షోరూంలో ఉన్న పాత ఫర్నిచర్ ను తొలగించి తన ఆస్తిని తను స్వాధీనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశాడు.