అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గంగవరం గ్రామంలో శుక్రవారం అరటి ఫ్రూట్ కేర్ ఆక్టివిటీ పై అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీఎంఐపి ధనుంజయ, కళ్యాణదుర్గం డివిజన్ ఉద్యాన శాఖ అధికారి కృష్ణ తేజలు గంగవరం గ్రామాలలో అరటి మొదటి మరియు రెండవ పంట కోత జరుగుతున్న తోటలను సందర్శించారు. రైతులకు అరటి లో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, ప్లాంట్ ప్రొటెక్షన్ మెసెర్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించి సిగటక ఆకుమచ్చ తెగులు పై రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఐఓ మల్లేష్, గ్రామ రైతులు ఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు.