అద్దంకి పట్టణంలో విద్యుత్తు దీప అలంకరణలో వాసవి మాతా దేవాలయం
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అద్దంకి పట్నంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయని విద్యుత్తు దీప అలంకరణలతో సుందరంగా అలంకరించారు ఈనెల 22 నుంచి అక్టోబర్ రెండు వరకు శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నామని పూజారి స్వర్ణ వెంకట సుబ్బారావు ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో పేర్కొన్నారు. తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు చివరి రోజు బ్రహ్మోత్సవం ఉంటుందన్నారు.