నంద్యాల అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలను మోడల్ గ్రీన్ క్యాంపస్ గా తీర్చిదిద్దాలి :నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 16, 2026
నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలు హైటెక్ సిటీ ప్లాంటేషన్ విస్తృతంగా చేపట్టి పచ్చదనం రూపొందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో హైడెన్సిటీ ప్లాంటేషన్ కార్యక్రమాలు అమలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో డ్రామా పీడీ సూర్యనారాయణ సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి డిఈఓ జనార్దన్ రెడ్డి హార్ట్ ఫుల్ మిస్ సంస్థ ప్రతినిధులు శర్వానంద్ సుబ్రమణ్యం జై సూర్య తదితరులు పాల్గొన్నారు