నంద్యాల అర్బన్: బండి ఆత్మకూరు మండలంలో తెలుగు గంగ కాలువలో పడిన టిప్పర్
Nandyal Urban, Nandyal | May 1, 2026
మట్టిని తరలిస్తున్న టిప్పర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనల మేరకు తెలుగు గంగ కట్ట వెంట భారీ వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదు. అయితే కొందరు మట్టి వ్యాపారులు బండి ఆత్మకూరు మండలం కృష్ణ నంది సమీపం నుంచి ఎర్రమట్టి, గ్రావెల్ ప్లాట్లకు, బట్టీలకు యధేచ్చగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. శుక్రవారం కృష్ణనంది సమీపంలో ఓవర్ లోడుతో వెళ్తున్న టిప్పర్ కాలువలో పడింది.