అమీర్పేట: ఉగ్రవాద చర్యలకు హైదరాబాద్ అడ్డాగా ఉండేది, ఇప్పుడు పరిస్థితి మారింది: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
సికింద్రాబాద్లోని తన నివాసంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు స్వాగతించామని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రధాని మోదీ ఉక్కు పాదంతో అనిచి వేశారని అన్నారు. ఉగ్రవాద చర్యలకు హైదరాబాద్ అడ్డాగా ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని అన్నారు.