ప్యాపిలి మండలంలో వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం కొమ్మిరి గ్రామానికి చెందిన నారాయణ స్వామి(59) వడదెబ్బతో గురువారం మృతి చెందాడు. కుటుంబ పోషణ కోసం ప్రతిరోజూ కరువు పనులకు వెళ్లే అతడు, రోజులాగే పనికి వెళ్తుండగా మార్గమధ్యలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.