నంద్యాల అర్బన్: అబ్బిపురంలో ఓ ఇంట్లో దేవుని పటాల వెనక నాగుపాము కలకలం
Nandyal Urban, Nandyal | Apr 23, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన బాలకృష్ణ ఇంట్లో పూజ గదిలోని చిత్రపటాల వెనుక పెద్ద నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మోహన్ అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ నాగుపామును సమీపంలోని నల్లమల అడవిలో విడిచిపెట్టారు. పామును పట్టుకోవడంతో బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు