భారత రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు దూరదృష్టి గల పరిపాలకుడిగా, ప్రజాస్వామ్య విలువల ప్రతీకగా నిలిచారని ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. అటల్–మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా మదనపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.అటల్ జీ జీవితం దేశభక్తి, మానవీయ విలువలు, సుశాసనానికి ప్రతిరూపమని తెలిపారు. “ప్రభుత్వాలు వస్తాయి–పోతాయి, కానీ దేశం నిలబడాలి” అనే ఆయన మాటలు యావత్ భారతానికి మార్గదర్శకమని అన్నారు. ప్రధానమంత్రిగా అటల్ వాజ్పేయి దేశాన్ని శక్తివంతమైన దిశలో నడిపారని, అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారి ప్రాజెక్టు, గ్రామీణ రహదారులు