కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని వామపక్ష, ట్రేడ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసేంత వరకూ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.