కర్నూలు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుని కలిసిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు జిల్లాలో యూరియా కొరత రాకుండా అవసరమైన మేరకు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు. బుధవారం ఉదయం 12 గంటలు విజయవాడలోని మంత్రి కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడిని ఆయన కలిశారు.. ఈ సందర్బంగా యూరియా సరఫరా పై చర్చించారు.అనంతరం ఎంపీ మాట్లాడుతూ జిల్లాలోని రైతులు యూరియా పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యూరియా కొరత రానీయకుండా చూస్తామని తెలిపారు.