అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో గురువారం ఐదు గంటల 40 నిమిషాల సమయంలో జాతీయ రహదారి అధికారులు కాంట్రాక్టర్ తో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా వాహనదారులు తీర ఇబ్బందిగా ఎదుర్కొంటున్నారని గత ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇలాంటి సమస్యలు గాలికి వదిలేసాడని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైల్వే బ్రిడ్జి పనులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశిస్తున్నామని 20 రోజుల్లోనే ఈ బ్రిడ్జి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పరిటాల సునీత పేర్కొన్నారు.