పటాన్చెరు: గుమ్మడిదల మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్బంగా సేవపక్షం కార్యక్రమంలో భాగంగా గుమ్మడిదల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు ఐలేష్ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు రాఘవ రెడ్డి, రాంరెడ్డి, సృజన లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.