నాగులుప్పలపాడు: రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పుగుండూరులోని ఒంగోలు-చీరాల రహదారిపై రోడ్డు దాటుతున్న హరిబాబు అనే వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.