బనగానపల్లె: పోలీసు నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు: నంద్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల నష్టపోతున్న రైతులకు అండగా నిలిస్తే.. పోలీసులతో నిర్బంధాలు పెట్టడం సిగ్గుచేటని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.బాబా ఫక్రుద్దీన్ అన్నారు. కొలిమిగుండ్ల మండలంలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వెలువరిస్తున్న కాలుష్యంతో పంట పొలాలు దెబ్బతిని రైతులు కుదేలవుతున్నారని అన్నారు. వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.