నిమ్స్ నర్సుల యూనియన్ చేపట్టిన శాంతియుత ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నర్సులు వారం రోజులుగా ఆందోళన చేస్తుండగా మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళన చేస్తున్న నర్సులను క్యాంపస్ గేట్లు మూసి లోపలే నిర్బంధించారు. తమ డిమాండ్ల కోసం నిరసన తెలుపుతున్న ఉద్యోగులను నిర్బంధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిరసనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.