ఒంగోలు అర్బన్: పదిమంది నూతన సిబ్బందికి నియామక పత్రాలను అందజేసిన జడ్పీ చైర్మన్
Ongole Urban, Prakasam | Apr 30, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతనంగా నియమితులైనటువంటి పదిమంది జూనియర్ అసిస్టెంట్లకు గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వహించాలని ప్రజలకు అండగా ప్రజల పక్షాన ప్రజా సేవ చేయాలని సూచించారు నిజాయితీ క్రమశిక్షణ నిబద్ధత సమయపాలన పాటిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉద్యోగం చేయటం అనేది ఒక బాధ్యతగా ఒక ప్రజాసేవగా భావించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు పాల్గొన్నారు