గుంతకల్లు: పామిడి శివారులో నీలూరు క్రాస్ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకురాలు మృతి
అనంతపురం జిల్లా పామిడి మండలంలోని నీలూరు క్రాస్ వద్ద బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని మతి స్థిమితం లేని యాచకురాలు అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పామిడి శివారులో జాతీయ రహదారిపై రోజు మతిస్థిమితం లేని మహిళ తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో బుధవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యాచకురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు