ఒంగోలు అర్బన్: జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Apr 28, 2026
పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి సంతమాగులూరు సర్కిల్ పరిధిలోని సంతమాగులూరు మరియు బల్లికురవ పోలీస్ స్టేషన్ లను మంగళవారం జిల్లా ఎస్పీ గారు ఆకస్మికంగా తనిఖీచేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న పలు రికార్డ్ లను పరిశీలించి, ప్రతి రికార్డు సంబంధించిన సమాచారాన్ని డి.ఎస్.పి , సి.ఐ లను అడిగి తెలుసుకున్నారు. నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని, అలాగే పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, కేసుల పరిష్కారంలో జాప్యం వహించే కొలది బాధితులకు సత్వర న్యాయం అందించలేమని అన్నారు