తాడిపత్రి: మండలంలోని చుక్కులూరులో ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు, రూ.31వేలు స్వాధీనం
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చుక్కలూరు గ్రామంలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చుక్కలూరు గ్రామ శివారులోని గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. పక్కా సమాచారంతో ఆదివారం తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎస్సై ధరణిబాబు, తన సిబ్బందితో కలిసి మెరుపు దాడులు చేశారు. ఓ రహస్య ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిని గుర్తించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.31వేలు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసినట్లు సీఐ శివ గంగాధర్ రెడ్డి తెలిపారు.