అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో అత్యంత భారీగా వర్షాలు కురిసాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు దీనికి సంబంధించిన వివరాలను గణాంక అధికారి మురళి తెలిపారు. రంపచోడవరంలో అత్యంత భారీగా 60.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, వై రామవరం మండలంలో 40.8 మిల్లి మీటర్లు, చింతూరు 18.8, దేవీపట్నం 18.4, మారేడుమిల్లి 18.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. మిగతా మండలాలలో ఓ మోస్తారు వర్షపాతం నమోదయిందని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.