ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని జూనియర్ కళాశాలలో మార్చి ఒకటో తేదీ ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్న సందర్భంగా సంబంధిత ఏర్పాట్లను టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు పరిశీలించారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా నియోజకవర్గంలోని ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మీ అన్నారు.