ఆళ్లగడ్డ: ఎర్రగుడి దిన్నెలో మినుముల విషయంలో గొడవ: అత్త వెంకట సుబ్బమ్మ ఆత్మహత్య
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఎర్రగుడి దీన్నే కు చెందిన వెంకట సుబ్బమ్మ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది ఇంట్లో వినియోగానికి తీసుకొచ్చిన మినుములు కనిపించకపోవడంతో ఆమెకు కోడలితో స్వల్ప వాగ్వివాదం జరిగినట్లు సమాచారం, మనస్థాపానికి గురైన వెంకట సుబ్బమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జయప్ప తెలిపారు, శుక్రవారం మృతురాలి భర్త బాల పుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు, భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు