అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గా నియమితులైన బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన తూమాటి ప్రసాద్ ను పార్టీ మండల నాయకులు ఆదివారం దుశ్యాలువాలు పూలమాలలతో సన్మానించారు. తనకు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ కు, మంత్రి సోదరులు పయ్యావుల శీనప్ప అన్నకి ఈసందర్బంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లి కార్జున, మండల నాయకులు పెద్దతిప్పయ్య, ఆవులెన్న సర్పంచ్ రామ్మోహన్ చౌదరి పాల్గొన్నారు.