రాజేంద్రనగర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం పై పోలీసుల దాడి
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్పేట్ సుభాష్ చంద్రబోస్ నగర్లో గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో జరిగుతున్న వ్యభిచార గృహంపై ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో లైబీరియా దేశానికి చెందిన డేరియస్ (28), కెన్యాకు చెందిన ఇద్దరు మహిళలు, ఉగాండాకు చెందిన మరో ఇద్దరు మహిళలు సహా మొత్తం 5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు విదేశీ మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు