నంద్యాల అర్బన్: మహానంది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
Nandyal Urban, Nandyal | Jul 11, 2026
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది. వరుసగా రెండు రోజులు సెలవు దినాలు రావడంతో భక్తులు విశేషంగా తరలివచ్చారు. క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు ఆలయంలోని పుష్కరిణిలలో పుణ్యస్నానం ఆచరించి శ్రీ కామేశ్వరి సమేత మహానందిశ్వర స్వామి వార్లను దర్శించుకొన్నారు. ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. స్వామివార్ల దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది.