కోనారెడ్డి చెరువు ఫీడర్ ఛానల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కేంద్రంలోని కోణారెడ్డి చెరువుకు నీటిని అందించే ఫీడర్ ఛానల్ కాలువ పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు పరిశీలించారు. గత రెండు రోజుల క్రితం ఆయన స్వయంగా పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా పనులు ఎంతవరకు జరిగాయో తెలుసుకోవడానికి వాటి పురోగతిని సమీక్షించారాయన.