గుంతకల్లు: పట్టణంలో ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన వైసీపీ నేతలు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ 11వ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 60 అడుగుల రోడ్డులో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి వైసీపీ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి భారత అణు వైజ్ఞానిక రంగాన్ని, క్షిపణుల పరిజ్ఞానాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పారని అన్నారు. అప్పటి నుంచి మిస్సైల్ మ్యాన్ పేరు లిఖించుకున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ మాజీ రాష్ట్రపతి అడుగుజాడల్లో నడవాలని అన్నారు.