అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఐదు కళ్ళు సదాశివం కాలనీలో బుధవారం రాత్రి 8:30 సమయంలో రాప్తాడు మహిళా సమైక్య కార్యదర్శి గౌని శారద ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించబోయే సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని కాలనీవాసులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య కార్యదర్శి శారద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో నిర్వహించే సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగిందని ప్రజలంతా ఈ కార్యక్రమం పాల్గొని విజయంతం చేయాలని రాప్తాడు మహిళా సమైక్య కార్యదర్శి శారద పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య మహిళలంతా పాల్గొన్నారు.