కర్నూలు: సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ సర్యాత్ర : వాణిజ్య పన్ను శాఖ సంయుక్త కమిషనర్ .నీరజ
వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లు సవరించిన నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ సర్యాత్ర భాగంగా సోమవారం వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవన శాఖ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, మహిళల ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. విజేతలకు త్రిమతి జె.నీరజ, సంయుక్త కమిషనర్, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ సి.రామకృష్ణ, కమ్యూనిటీ ఆర్గనైజర్ భారతి (MEPMA), డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎం.కె.ఎల్.రాయప్ప, ఎ.సుంకన్న తదితరులు పాల్గొన్నారు.