జూటూరు గ్రామం వద్ద బైకును ఢీకొన్న బొలెరో వాహనం, యువకుడికి తీవ్రగాయాలు కర్నూలు ఆసుపత్రికి తరలింపు
పాములపాడు మండలం జుటూరు గ్రామం వద్ద బైకును బొలెరో వాహనం వేగంగా వచ్చే ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న మహేంద్ర గౌడ్ అనే ఒకడికి తీవ్ర గాయాలు అయ్యాయి,జూటూరు గ్రామానికి చెందిన మహేందర్ గౌడ్ ప్రధాన రహదారికి వస్తుండగా,PSK కంపెనీకి చెందిన బొలెరో వాహనం కంపెనీలో నుంచి అతివేగంగా వచ్చి బైకును ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి,అతనిని వెంటనే నేషనల్ హైవే అంబులెన్స్ లో ఆత్మకూరుకు తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఈ సంఘటనపై పాములపాడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు,