ఒంగోలు అర్బన్: ఒంగోలులో మతమార్పిడులను అరికట్టాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన బజరంగ్దళ్ సభ్యులు
Ongole Urban, Prakasam | Apr 18, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కలెక్టరేట్ వద్ద శనివారం విహెచ్పి , బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్న మత మార్పిడులు, వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. సమాజంలో ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి హిందూ అమ్మాయిలను మత మార్పిడిలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తల్లిదండ్రులారా జాగ్రత్త.. మీ అమ్మాయిలను కాపాడుకోండని హెచ్చరించారు.