ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకు పింఛన్ పథకాన్ని అమలు చేయాలని YCP రాష్ట్ర అధికార ప్రతినిధి మగ్దూం మొహిద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం గూడూరు దర్గా వీధిలో ఉన్న వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్ష తేదీలను రంజాన్ మాసంలో కాకుండా మార్చాలని కోరారు.