తాడికొండ: సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా జీఎస్టీ సంస్కరణలు జరిగాయి: ఏపీ 20 సూత్రాల అమలు చైర్మన్ దినకర్
ఏపీలోని 20 సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ దినకర్ ఆదివారం వెలగపూడిలో మీడియాతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా జీఎస్టీ సంస్కరణల అమలుపై ప్రకటన విడుదల చేశారు. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం ప్రకారం, సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వచ్చేలా 4 కేటగిరీలు (5%, 12%, 18%, 28%) 2 2 ω (5% మరియు 18%)కి జిఎస్టి రేట్లను పునర్వ్యవస్థీకరించడం ద్వారా జీఎస్టీ సంస్కరణలను అమలు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.